Home Sports గోలిగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ శతాబ్ది వేడుకల్లో సెంటినరీ మారథాన్

గోలిగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ శతాబ్ది వేడుకల్లో సెంటినరీ మారథాన్

గోలిగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ శతాబ్ది వేడుకల్లో సెంటినరీ మారథాన్

హైదరాబాద్‌లోని సెంట్రల్ గురుద్వారా సాహిబ్, గోలిగూడ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సెంటినరీ మారథాన్ నిర్వహించారు. “రన్ ఫర్ ఫెయిత్, రన్ ఫర్ సేవా” నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3కే, 5కే రన్‌తో పాటు ఫ్యామిలీ వాక్‌థాన్ నిర్వహించారు.హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్, ఐమాక్స్ సమీపం నుంచి ప్రారంభమైన మారథాన్ పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ మీదుగా సాగి తిరిగి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌కు చేరుకుంది. అన్ని వయసుల వారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 5,000 మందికి పైగా పాల్గొన్నారు.సీజీఎస్‌జీ ప్రబంధక్ కమిటీ చైర్మన్ ఎస్. రాజేందర్ సింగ్, అధ్యక్షుడు ఎస్. త్రిలోక్ సింగ్, కార్యదర్శి ఎస్. హర్విందర్ సింగ్ పంధాత్, ఉపాధ్యక్షులు ఎస్. ఇందర్ పాల్ సింగ్, ఎస్. సురిందర్ పాల్ సింగ్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలకు మెడల్స్ అందజేయగా, మారథాన్‌లో పాల్గొన్న ప్రతి వాకర్‌కు డిజిటల్ సర్టిఫికెట్లు అందించారు.

Leave a Reply

Your email address will not be published.