హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు ‘రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026’ హైదరాబాద్‌లో నిర్వహించారు. హెల్త్‌కేర్, జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్), పరిశోధన, ఇన్నోవేషన్ రంగాలకు చెందిన నాయకులు, నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్రైడెంట్‌లో జరిగిన ఈ సమ్మిట్‌లో ఆరోగ్యరంగంలో వేగంగా మారుతున్న సాంకేతికత, ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలు, లైఫ్ సైన్సెస్‌లో భవిష్యత్ అవకాశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు....

