హైదరాబాద్ నాయర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం (ఆగస్టు 23) బోయిన్‌పల్లిలోని ఎంఎంఆర్ గార్డెన్స్‌లో ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు కేరళ డీజీపీ ఎస్. శ్రీజిత్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కేరళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను ప్రత్యేకంగా రూపొందించారు. పూక్కళం, చెండమేళం, మహాబలి స్వాగతం, కేరళ సంప్రదాయ దుస్తుల్లో మహిళల తిరువాతిరకళి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీజిత్, ఐపీఎస్ మరియు ఆయన బృందం అందించే ‘సంగీత సదస్సు’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.వేడుకల్లో భాగంగా సంప్రదాయ ఓనం విందును ఏర్పాటు చేశారు. 24 రకాల రుచికరమైన వంటకాలతో పాటు ప్రథమన్ తదితర ప్రత్యేక వంటకాలను అతిథులకు అందించనున్నారు. హైదరాబాద్‌లోని మలయాళీ సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొని ఓనం పండుగను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరుపుకోనుంది.ఈ కార్యక్రమానికి సుమారు 1,300 మందికి పైగా మలయాళీ ప్రజలు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఓనం పండుగ ద్వారా ఐక్యత, సోదరభావం, కేరళ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయర్ సర్వీస్ సొసైటీ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ సోమన్ నాయర్ కె. తెలిపారు.







Leave a Reply