హైదరాబాద్, సెప్టెంబర్ 24:
ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు ‘రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026’ హైదరాబాద్‌లో నిర్వహించారు. హెల్త్‌కేర్, జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్), పరిశోధన, ఇన్నోవేషన్ రంగాలకు చెందిన నాయకులు, నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
హైదరాబాద్ ట్రైడెంట్‌లో జరిగిన ఈ సమ్మిట్‌లో ఆరోగ్యరంగంలో వేగంగా మారుతున్న సాంకేతికత, ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలు, లైఫ్ సైన్సెస్‌లో భవిష్యత్ అవకాశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హెల్త్‌కేర్ సేవలను మరింత సమర్థవంతంగా, అందుబాటులోకి తీసుకురావడంలో ఇన్నోవేషన్, టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తాయని చర్చించారు.
వైద్య రంగం, పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన కొత్త ఆలోచనలు, పరిష్కారాలపై సమ్మిట్‌లో దృష్టి సారించారు. హెల్తార్క్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది.








Leave a Reply