Home Health పింక్ పవర్ రన్ 3.0కు శ్రీకారంరొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మహిళలంతా భాగస్వాములు కావాలి. – సుధారెడ్డి

పింక్ పవర్ రన్ 3.0కు శ్రీకారం
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మహిళలంతా భాగస్వాములు కావాలి. – సుధారెడ్డి

పింక్ పవర్ రన్ 3.0కు శ్రీకారంరొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మహిళలంతా భాగస్వాములు కావాలి. – సుధారెడ్డి

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, మహిళల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచడం లక్ష్యంగా నిర్వహించనున్న ‘పింక్ పవర్ రన్ 3.0’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రన్‌కు సంబంధించిన ప్రత్యేక టీ-షర్ట్, మెడల్స్‌ను ఆవిష్కరించారు.మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు సుధారెడ్డి తెలిపారు. ఆరోగ్య అవగాహనతో పాటు ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడమే పింక్ పవర్ రన్ ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ కార్యక్రమంలో పింక్ పవర్ రన్ ప్రతినిధులు సుధారెడ్డి, మిస్ వరల్డ్ 2025 సూచటా, డాక్టర్ ప్రజ్ఞ లతో పాటు పలువురు ప్రముఖులు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, రన్‌లో పాల్గొనే వారు పాల్గొన్నారు. ‘లెట్స్ డూ ఇట్’అనే సందేశంతో మహిళల ఆరోగ్యం, సాధికారత కోసం అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన – ఆరోగ్యకరమైన సమాజం దిశగా మరో అడుగు అనే లక్ష్యంతో పింక్ పవర్ రన్ 3.0ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రన్ సెప్టెంబర్ 27 న నెక్లెస్ రోడ్ లో ఉదయం 5గంటల కి ప్రారంభించనున్నారని. సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థపకురాలు సుధారెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.