Home Business అక్టోబర్ 30 నుంచి నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో.

అక్టోబర్ 30 నుంచి నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో.

అక్టోబర్ 30 నుంచి నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో.
నరెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో 16వ ప్రాపర్టీ షో–2026 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హాల్ నంబర్ 4లో నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల ప్రదర్శనలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాటెడ్ డెవలప్‌మెంట్లు, వాణిజ్య స్థిరాస్తులకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు.
గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఒకే వేదికపై వివిధ ప్రాజెక్టులను పరిశీలించి, డెవలపర్లతో నేరుగా చర్చించే అవకాశం కల్పించనున్నారు. ఎస్‌బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు పాల్గొని గృహ రుణాలు, ఇతర ఆర్థిక సదుపాయాలపై సమాచారం అందించనున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను కూడా ప్రదర్శించనున్నాయి.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రాపర్టీ షో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా స్థిరాస్తులను ఎంపిక చేసుకునేందుకు ఉపయోగపడుతుందని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొప్పుల తెలిపారు. ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.