హైదరాబాద్‌లో రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్‌-4 గ్రాండ్ ఫినాలే

సీగ్రామ్స్ రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్‌-4 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. సంగీతం, హిప్‌హాప్, గేమింగ్, ఆర్ట్, కల్చర్‌ను మేళవించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.అంతర్జాతీయ హిప్‌హాప్ స్టార్ ఫ్రెంచ్ మోంటానా తొలిసారిగా భారత్‌లో ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రముఖ గాయకులు ఎల్‌వీ రేవంత్, నిఖితా గాంధీ, డీజే సాహిల్ గులాటి తమ ప్రదర్శనలతో సందడి చేశారు. గేమింగ్ కంటెంట్ క్రియేటర్ పాయల్ ధారే నిర్వహించిన లైవ్ గేమింగ్ ఫేస్‌ఆఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.నాలుగు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫినాలేతో రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్‌-4 ఘనంగా ముగిసింది. సంగీతంతో పాటు యువత సంస్కృతి, గేమింగ్, ఆర్ట్‌ను కలిపిన ఈ వేడుక ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.

Leave a Reply

Your email address will not be published.