
నా రా జపాన్ హబ్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ జపనీస్ అసోసియేషన్ సహకారంతో అక్టోబర్ 11న హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్–2026 నిర్వహించనున్నారు. ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.హైదరాబాద్‌లో తొలిసారిగా మియోషి సిటీ పప్పెట్ షో, ప్రత్యేక ఇకెబానా ప్రదర్శన, ఇండియా–జపాన్ ఇన్నోవేషన్ హ్యాకథాన్ అవార్డులు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. జపాన్‌లో విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ అవకాశాలపై యువతకు ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నారు.బోన్సాయ్, సుమి–ఏ, అనిమే, రోబోటిక్స్, మార్షల్ ఆర్ట్స్, జపనీస్ టీ సెరిమనీ, కాస్ప్లే తదితర సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. మీడియా సమావేశంలో నా రా జపాన్ హబ్ వ్యవస్థాపకుడు బి. రామ భద్ర, కో-ఫౌండర్ బి. నాగనాథ్, హైదరాబాద్ జపనీస్ అసోసియేషన్ ప్రతినిధులు హిరోషి ఫురుటా, సోయిచిరో ససాకి, టగుచి హిడెట్సుగు పాల్గొని ఫెస్టివల్ వివరాలు వెల్లడించారు.

Leave a Reply