హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. తొలిరోజే పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ట్రాఫిక్ విధానానికి అలవాటు పడేందుకు 7–10 రోజులు పట్టొచ్చని పోలీసులు తెలిపారు.
